తిరుపతి: తిరుపతి రైతు బజార్‌లో ఉల్లి రైతులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఉల్లికి గిట్టుబాటు ధర లేదని రైతులు పవన్‌కు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. పెరిగిన ఉల్లి ధరలతో మధ్యవర్తులే లాభపడుతున్నారని... రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. ఉల్లి కోసం ప్రజలు రోజంతా వేచిచూసే పరిస్థితి రావడం దారుణమన్నారు. దీనిలో ప్రభుత్వ పాలనా వైఫల్యం కనిపిస్తోందని పవన్ పేర్కొన్నారు. కూల్చివేయడం, కాంట్రాక్టులు రద్దు చేయడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందన్నారు. పాలన చేతకాకపోతే తిరిగి ఎన్నికలకు వెళ్లండన్నారు. అన్నింటినీ గత ప్రభుత్వాలపై నెట్టివేయడం సరికాదని... అలా అయితే బ్రిటీష్ ప్రభుత్వం వరకు వెళ్తుందని పవన్ పేర్కొన్నారు
ఉల్లి కోసం వేచి చూసే పరిస్థితి రావడం దారుణం: పవన్